6G Telecom Services : సాంకేతిక విప్లవం ఏటికేడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు చిన్న సమాచారం కోసం ఎదురు చూసే మనం. నేడు అరచేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకోని సెకన్లలో ప్రపంచాన్ని చూస్తున్నాం. 2జీ, 3జీ, 4జీ లాంటి ఇంటర్నెట్ను ఆస్వాదించిన ప్రజలు మరికొన్ని రోజుల్లో 5జీలోకి అడుగు పెట్టబోతున్నారు. మరి, భవిష్యత్ అవసరాలకు ఈ స్పీడ్ సరిపోతుందా? అంటే కష్టమేనని చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరించిన వేళ అంతర్జాలం వేగమూ పెరగాల్సిన అవసరం ఉంది. అందుకు పరిష్కారమే 6జీ. ముందుతరాలను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా అడుగులు పడుతున్నాయి.