ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్‌లో ఉద్రిక్తత

  • 2 years ago
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్‌‌లో భాగంగా ఆత్మకూరు మండలం బట్టేపాడు పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ.. అక్కడే ఉన్న స్వతంత్ర అభ్యర్థి తూమాటి శశిధర్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ స్టేషన్లోకి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకోకుండా.. తననే నిలువరించే ప్రయత్నం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు.. శశిధర్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ స్వతంత్ర అభ్యర్థి శిశధర్ రెడ్డి మండిపడ్డారు.

Recommended