పూర్తిగా మాస్టారుగా మారిన కేదారేశ్వరరావును చూశారా..

  • 2 years ago
శ్రీకాకుళం జిల్లా సీది గ్రామానికి చెందిన కేదారేశ్వరరావు లుక్ మారిపోయింది. 1998 లోనే డీఎస్సీ రాసి ఎంపికైనా.. నియామకాలు జరగకపోవడంతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఆయన దీనస్థితిలోకి వెళ్లిపోయారు. 23 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో ఆయన ఉద్యోగంలో చేరబోతున్నారు. కేదారేశ్వరరావు గురించి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో గ్రామానికి చెందిన యువత ఆయనతో కేక్ కట్ చేయించారు. కొత్త బట్టలు, షూస్ కొనిచ్చారు. సెలూన్‌కు తీసుకెళ్లి కటింగ్ చేయించారు. ఇన్నాళ్లూ సైకిల్ మీద తిరుగుతూ చీరలు అమ్ముకుంటున్న ఆయన రూపమే మారిపోయింది.

Recommended