టీటీడీ కళ్యాణమస్తుకు ముహూర్తం ఫిక్స్

  • 2 years ago
పేదవారికి అండగా ఉండడానికి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈరోజు ఉదయం అభిషేక సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైవీ సుబ్బారెడ్డి.. ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నామని చెప్పారు. ఆగస్టు 7వ తేదీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8 గంటల 7 నిమిషాల నుంచి 8 గంటల 17 నిమిషాల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని చైర్మన్ తెలిపారు.

Recommended