వైఎస్ సునీతా రెడ్డి ఎవరున్నారో చెప్పారు.. ఆయన్ను ఎందుకు ప్రశ్నించరు: లోకేష్

  • 2 years ago
ఏపీ అప్పుల్లో మునిగిపోయిందని.. ఇలాగే పోతే ప్రజలపై పన్నులు భారం పెరుగుతుందన్నారు నారా లోకేష్. ఇప్పటికే అన్ని తాకట్టు పెట్టారరని.. ఇంకా రోడ్లు మిగిలాయి వాటిని తాకట్టు పెడతారని ఎద్దేవా చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేసే అర్హత జగన్‌కు లేదన్నారు. కేంద్రం బౌండరీలు మార్చొద్దు అని చెప్పినా హడవుడిగా జిల్లాల విభజన చేశారని ఆరోపించారు. కాపుల సమావేశం వారి వ్యక్తి గతమని.. కాపులకు బహుజనులకు వెంట ఉండేది టీడీపీ మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బాబాయి హత్యపై జగన్ ఎందుకు స్పందించడం లేదని లోకేష్ ప్రశ్నించారు. చంపిన వాళ్ళను ఎందుకు కనిపెట్టడం లేదన్నారు. సీబీఐ పై పోలీసులు కేసులు పెట్టడం మొదటిసారి చూస్తున్నానని.. సునీతా రెడ్డి హత్య వెనుక ఎవరున్నారో చెప్పారన్నారు. 2019లో చంద్రబాబు చంపారన్న జగన్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు సీబీఐ విచారణ కోరలేదని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి గుండె పోటు అని చెప్పి ఇప్పుడు రోడ్ల పై తిరుగుతున్నారన్నారు.

Recommended