టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలకు ఆదరణ లభిస్తున్న వేళ సరికొత్త కథా కథనాలు పురుడుపోసుకుంటున్నాయి. సినిమా చిన్నదైనా, పెద్దదైనా... ఆకట్టుకునే కథ ఉంటే చాలు జనాలు ఆదరిస్తున్న తరుణంలో... మరో విభిన్నమైన సినిమాకు శ్రీకారం చుట్టుకుంది. డామిట్ డేవిడ్ రాజుకు పెళ్లైపోయింది అనే భిన్నమైన టైటిల్ తో కొత్త చిత్రాన్ని లాంచ్ చేశారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరుగాంచిన జీవికే దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ప్రియతమ శిష్యుడిగా పేరుగాంచిన సంగీత దర్శకుడు ML రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.