ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ ఎన్వీ రమణ ఘాటు వ్యాఖ్యలు

  • 3 years ago
దేశ రాజధానిలో కాలుష్యాన్ని 24 గంటల్లోగా అరికట్టాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు సూచించకపోతే.. కఠిన ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం... కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.