IPL 2021 : చీకటి రోజుల్లో దయలేదు.. KKR స్పిన్నర్ ఆవేదన | KKR vs RCB || Oneindia Telugu
  • 3 years ago
Kolkata Knight Riders' Varun Chakravarthy opened up on the trolling he received on social media following his positive COVID-19 test in May
#Ipl2021
#VarunChakravarthy
#Kkr
#Kkrvsrcb

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తికి ఐపీఎల్ 2021 ఓ పీడకలలా మారింది. ఎందుకంటే.. ఐపీఎల్ 2021తొలి దశలో అతడికే మొదటగా కరోనా సోకింది. అతడి నుంచి వివిధ జట్లలో ఆటగాళ్లకు పాజిటివ్ గా తేలడంతో మొత్తం లీగ్ నే వాయిదా వేశారు. కరోనా సోకిన చాలా రోజుల తర్వాత కానీ వరుణ్‌ మహమ్మారి నుంచి కోలుకోలేదు. శారీరకంగా బలహీనంగా ఉండటంతో కోలుకోవడానికి అతడికి చాలా రోజులు పట్టాయి. ఇక ఆదివారం (అక్టోబరు 10) వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేకేఆర్ విడుదల చేసిన వీడియోలో.. ఆ చీకటి రోజులను వరుణ్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ 2021 నీ వల్లే ఆగిపోయిందని, నువ్ చచ్చిపోయుంటే బాగుండేదని పలువురు నెటిజన్లు పోస్టులు చేశారని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Recommended