US Election 2020: A victory for “we the people” - Joe Biden | Oneindia Telugu
  • 3 years ago
Joe Biden in his first address as the US President-elect called it a victory for “we the people”. “People of this nation have spoken, they delivered us a clear victory. A victory for, we the people. We have won with the most votes ever cast on presidential ticket in the history of the nation, 74 million,” said Biden. He further added, “For all those of you who voted for President Trump, I understand the disappointment tonight. Now let's give each other a chance.


#USElection2020Results
#JoeBiden
#DonaldTrump
#KamalaHarris
#JoeBidenfirstspeech
#ballotcounting
#swingstates
#BarackObama
#Postalballotsvotes
#RepublicanParty
#IndianElectonSystem
#elections2020USA
#democraticparty
#UnitedStates

అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్‌తో కలిసి తన సొంత రాష్ట్రం డెల్వర్‌లోని మిల్మింగ్టన్ నుంచి ఆయన మాట్లాడారు. క్రిస్టీనా రివర్ వద్ద గల ఛేజ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జో బిడెన్ అభిమానులు, డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. అధ్యక్షుడిగాా తనను గెలిపించినందుకు అమెరికన్లకు కృతజ్ఙతలు తెలిపారు. విభజించి
పాలించడం అనే సూత్రాన్ని తాను ఏ మాత్రం విశ్వసించబోనని, అందరినీ సమాన దృష్టితో చూస్తానని జో బిడెన్ అన్నారు. ఈ దిశగా తాను ప్రతిజ్ఙ చేస్తున్నానని చెప్పారు. నో బ్లూ స్టేట్.. నో రెడ్ స్టేట్.. ఓన్లీ యునైటెడ్ స్టేట్స్.. అని వ్యాఖ్యానించారు. ఈ రెండు రంగులూ డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీల ఎన్నికలకు సంబంధించినవి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసిన వారు తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురై ఉంటారని, వారి ఆవేదనను తాను అర్థం చేసుకోగలుగుతానని అన్నారు.
Recommended