IND vs SA : Nobody Is Going To Relax, We'll Go For Clean Sweep : Kohli

  • 5 years ago
Kohli is looking to make it a 3-0 clean sweep with one eye on the ICC World Test Championship.“It’s been nice, but looking at the larger picture, the Test Championship, every game has even more value,” the India skipper stated after the big win.“We’re not going to take the foot off the gas in the third Test, we’re looking for a result again, and hopefully make it 3-0.
#indiavssouthafrica
#indvssa
#viratkohli
#testchampionship
#Teamindia
#india
#southafrica
#mayankagarwal
#rohithsharma
#shami
#umeshyadhav
#jadeja


సిరీస్ గెలిచామనే రిలాక్స్ అయ్యే ప్రసక్తే లేదు. క్లీన్‌స్వీప్ చేయడమే మా ముందున్న లక్ష్యం అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబరచిన వేళ రెండో టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 137 పరుగులతో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. దీంతో సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది.డబుల్ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీకి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' దక్కింది. ఈ సందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టినప్పుడు టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్నాం. అప్పుడు కొన్ని విభాగాల్లో చాలా బలహీనంగా ఉన్నాం. వాటిని అధిగమించడానికి ఎంతో శ్రమించాం. జట్టులోని ప్రతి ఒక్కరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మంచి స్థితికి చేరుకున్నాం' అని అన్నాడు.

Recommended