Sourav Ganguly Set To Be Next BCCI President || Oneindia Telugu
  • 5 years ago
All the affiliated units of the BCCI finalised the names of their new office-bearers in an informal meeting in Mumbai on Sunday. A consensus between the state units of BCCI has been built for former India captain and Cricket Association of Bengal (CAB) President Sourav Ganguly as the front runner for the post of BCCI president.
#souravgangulybccipresident
#gangulyasbccipresident
#SouravGanguly
#BCCIpresident
#amithshah
#jayshah
#anuragthakur
#arundhumal
#ipl
#brijeshpatel

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) నూతన అధ్యక్షునిగా ఎన్నికవడం దాదాపు ఖాయం అయింది. కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా ఎంపిక కానున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ బోర్డు కోశాధికారిగా పగ్గాలు చేపట్టనున్నారు.బీసీసీఐ ఎన్నికలలో ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా కీలక పదవులు దక్కించుకునేందుకు క్రికెట్‌ వర్గాలు, కేంద్ర రాజకీయ వర్గాల మధ్య గత కొంత కాలంగా చర్చలు కొనసాగాయి. సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం సాయంత్రం ఒప్పందం కుదిరింది. ఈ నెల 23న బీసీసీఐ ఎన్నికలు జరగనుండగా. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ. అయితే తాజా ఒప్పందం నేపథ్యంలో పోటీ లేకుండా వీరందరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
Recommended