#Curry Leaves చెమటకి చెక్ పెట్టే కరివేపాకు... #curry #sweat #every day #take #health #tips

  • 5 years ago
What if you take curry every day కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, మెగ్నిషియం, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ప్లాస్టీ స్టెరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి అనేక పోషకాలున్నాయి. ఇటువంటి కరివేపాకులో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం.

కరివేపాకు అజీర్ణాన్ని పోగొట్టి ఆకలిని పెంచుతుంది. జీర్ణాశయ సమస్యలను నియంత్రించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ప్రేగులు, పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ సమస్యల నుండి కాపాడుతుంది. కరివేపాకును ప్రతిరోజూ తీసుకుంటే చెమట ఎక్కువగా పట్టదు.

న్యూమోనియా, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యల నుండి కాపాడేందుకు కరివేపాకు దివ్యౌషధంగా సహాయపడుతుంది. మధుమేహం, రక్తపోటు రుగ్మతలను తగ్గించుటలో చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ ప్రేరేపిత కారకాలను నియంత్రిస్తుంది. ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. కరివేపాకులో గల కార్బోజోల్ ఆల్కలాయిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తుంది. #curry #every day #take #health #tips #sweat

Watch the latest Telugu news Live and Telugu Feature Content on the most popular Portal Webdunia Telugu on YouTube. Watch all the current, latest, Trending News, Tollywood, entertainment, sports, Health, Recipe and many more.

► Like us on Facebook: https://www.facebook.com/Webdunia-Tel...
► Follow us on Twitter: https://twitter.com/WebduniaTelugu
► Visit Website: https://telugu.webdunia.com/
► Follow Webdunia Telugu on Helo: https://studio.helo-app.com/

Recommended