ఇస్మార్ట్ శంకర్ లో అవకాశం కొట్టేసిన నిధి అగర్వాల్ || Nidhi Agarwal || iSmart Shankar

  • 5 years ago
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇటీవలే ప్రారంభమయ్యింది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ని ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. నిధి అయితే తన సరసన ఈ చిత్రంలో పర్ఫెక్టుగా వుంటుందని రామ్ చెప్పడంతో బుక్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అందం అభినయంతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్‌కి తెలుగులో ఇది మూడో సినిమా. త్వరలో నిధి అగర్వాల్ షూటింగ్‌లో పాల్గొననుంది. #NidhiAgarwal #iSmartShankar #Ram