Skip to playerSkip to main contentSkip to footer
  • 7/10/2019
కేరళకు చెందిన జైళ్ల శాఖ డిజిపి రిషిరాజ్ సింగ్ బాలీవుడ్ లెజెండ్, అతిలోక సుందరి శ్రీదేవి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అందరూ అనుకుంటున్నట్లు ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో పడి చనిపోలేదని, హత్య చేయబడిందని వ్యాఖ్యానించారు. ఆయన ఇంటర్వ్యూను కేరళకు చెందిన కౌముది పత్రిక ప్రచురించింది. తన ఫ్రెండ్, ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతన్ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా డిజిపి రిషిరాజ్ వెల్లడించారు. శ్రీదేవి హత్య చేయబడి ఉంటుందని నా స్నేహితుడు చెప్పడంతో మరిన్ని విషయాలు అడిగాను, కొన్ని కీలక ఆధారాలు ఆమెది యాక్సిడెంటల్ డెత్ కాదు, మర్డర్ అని రుజువు చేస్తున్నాయని చెప్పినట్లు తెలిపారు.

#sridevi
#tollywood
#bollywood
#boneykapoor
#rishirajsingh
#bollywood
#kerala
#JanhviKapoor
#arjunkapoor

Recommended