ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డికి పొలం ప‌నులంటే ప్రేమ‌.. వ్య‌వ‌సాయ శాఖ ఖాయ‌మా? || Oneindia Telugu

  • 5 years ago
YSR Congress Party Senior Leader and Mangalagiri MLA Elected in Guntur District Alla Rama Krishna Reddy all set to take oath as Minister in YS Jagan Mohan Reddy Cabinet. There is rumors that, He may get Agriculture Minister in the Cabinet.
#apelectionresults2019
#AllaRamakrishnaReddy
#mangalagiri
#gunturdistrict
#ycp
#ysjagan
#nara lokesh
#tdp
#andhrapradesh
#chandrababunaidu

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి అప్పుడే పొలం ప‌నుల్లో దిగిపోయారు. స్వ‌యంగా ట్రాక్ట‌ర్‌ను న‌డిపిస్తూ పొలాన్ని దున్నుతూ క‌నిపించారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆయ‌న జిల్లాలోని మంగ‌ళగిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్‌ను ఆయ‌న ఓడించారు. ఎమ్మెల్యేగా ఇంకా ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ లోగా- వ్య‌వ‌సాయ ప‌నుల్లో నిమ‌గ్న‌మయ్యారు ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి. ఆయ‌న‌ కుటుంబానికి వ్య‌వ‌సాయ‌మే ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. మంగ‌ళ‌గిరి శివార్ల‌లో వారికి పొలం ఉంది. దాన్ని ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి స్వ‌యంగా సాగు చేస్తుంటారు. న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌పై ఆయ‌నకు మంచి ప‌ట్టు ఉంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కొన్ని కీల‌క అంశాల్లో ఆయ‌న న్యాయ‌పోరాటం చేశారు.

Recommended