మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాజకీయ, సినిమా అంశాలపై నాగబాబు చేస్తున్న వీడియోలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ని ఉద్దేశించి నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరమైన రాజకీయ చర్చకు కారణం అవుతున్నాయి. తాజాగా నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునిపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మొత్తం చంద్రబాబుపై నాగబాబు సరదాగా సెటైర్స్ వేస్తూ కనిపించారు.