ICC Cricket World Cup 2019 : There Is A Huge Ammount Of Loss If Ind-Pak Match Was Cancelled
  • 5 years ago
The match between India and Pak has not happened since the Champions Trophy. Four years later, the match between the two teams will not be reduced to the revenue of the club. The match will be more prestigious for both teams and fans in World Cup, which will take place this year at Pulwama incident.
#iccworldcup2019
#indiavspak
#cricket
#indiancricketteam
#england
#manchester
#pulwamaincident
#harbajansingh
#sunilgavaskar


పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వరల్డ్ కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని కొందరు క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.అయితే, వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగపోతే కలిగే నష్టం గురించి ఆలోచిస్తే దిమ్మదిరగాల్సిందే. గతంలో భారత్-పాక్ మ్యాచ్ ప్రసార హక్కుల్ని దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్‌ని కుదించడం వల్ల పెద్ద మొత్తంలో నష్టపోయింది. ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌-పాక్ మ్యాచ్‌ని వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించారు.రెండు ఇన్నింగ్స్‌ల్లో 4 ఓవర్లు తగ్గించడం వల్ల తమకు రూ.10 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రసారదారు స్టార్‌ ఇండియా ప్రకటించింది. ఇక, ఆస్ట్రేలియాలో జరిగిన 2015 వరల్డ్‌కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను ఏకంగా 29 కోట్ల మంది చూసినట్లు అంచనా. ఈ మ్యాచ్‌ ద్వారా రూ.110 కోట్ల ఆదాయం వచ్చింది.
Recommended