Sneha Ullal On Her Reentry In Films | అప్పట్లో హీరోయిన్లకు నరకం కనిపించేది - స్నేహా ఉల్లాల్

  • 5 years ago
Actress Sneha Ullal wants to come back to the business because she believes that the entertainment industry is currently celebrating womanhood in the right manner. Sneha has worked for films in Tollywood naming Ullasamga Utsahamga, Simha, Ala Modalaindi among others.
#SnehaUllal
#avimittal
#Bollywood
#UllasamgaUtsahamga
#SimhAla Modalaindia
#AlaModalaindi

అనారోగ్యం, ఇతరత్రా విషయాల కారణంగా అందాల భామ స్నేహ ఉల్లాల్ సినీ పరిశ్రమకు దూరమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలపై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. తొలుత ఐశ్వర్య రాయ్‌లా కనిపిస్తారనే ముద్ర వేసుకొన్న స్నేహ ఉల్లాల్ బాలీవుడ్‌‌లో ఎక్కువ కాలం నిలదొక్కకోలేకపోయారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడపాదడపా మెరిసిన ఈ అందాల భామ ప్రస్తుతం కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో పలు విషయాలను వెల్లడించారు..

సినీ పరిశ్రమలో మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనుకొంటున్నాను. ఇప్పడు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు సముచిత గౌరవం లభిస్తున్నది. ఇది పరిశ్రమకు శుభపరిణామం. మహిళలకు స్వేచ్ఛ, గౌరవం ఎప్పుడు లభిస్తుందా అని వేచిచూసే సమయానికి ప్రస్తుతం సానుకూలంగా ఉంది అని స్నేహా ఉల్లాల్ అన్నారు.