Chandrababu Meeting With The Leaders Of Non-BJP Parties In The Evening | Oneindia Telugu

  • 5 years ago
Chandrababu is going to Delhi today. He will be meeting with the leaders of non-BJP parties in the evening. Congress leader Rahul Gandhi, Mayawati, Sharad Pawar, Farooq Abdullah, Deve Gowda and Sitaram Yechury will meet.
#Chandrababurahulmeeting
#Chandrababunaidu
#RahulGandhi
#Mayawati
#SharadPawar
#FarooqAbdullah
#DeveGowda
#SitaramYechury
#nonBJPparties
#Congress


సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీ సీయం చంద్ర‌బాబు నాయుడు దూకుడు పెంచిన‌ట్టు తెలుస్తోంది. బీజేపి ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న జాతీయ స్థాయిలో పావులు క‌దుపుతున్నారు. అందులో భాగంగా ఆయ‌న ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే ఎన్నికల కోసం బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుపై కలిసివచ్చే నాయకులతో చర్చిలు జరుపుతున్న విషయం తెలిసిందే. సాయంత్రం బీజేపీయేతర పక్షాల నేతలతో చంద్రబాబు భేటీ అవుతారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మాయావతి, శరద్‌పవార్‌, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ, సీతారాం ఏచూరిని కలవనున్నారు. కూటమి విధివిధానాలు, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చించనున్నారు. అంతేకాకుండా టీడీపీ ఎంపీలతో సమావేశంకానున్నారు. కేంద్రంతో పోరాటంపై ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు, పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులపై ఎంపీలతో బాబు చర్చించనున్నారు.

Recommended