South States Parties Check For BJP And Congress

  • 6 years ago
Kamal Haasan made every effort to remain ideologically neutral at the launch of his political party Makkal Needhi Maiam on Wednesday, and it was perhaps this attempt that made him take the names of Arvind Kejriwal, Chandrababu Naidu, Pinarayi Vijayan and Barack Obama when asked about the leaders that have been his inspiration.

2019 ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిన అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీకి చెక్ చెప్పేందుకు కొన్ని పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే కావొచ్చునని అంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రంలో ఆయా ప్రాంతీయ పార్టీకి పట్టు ఉంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్నాటకలో జేడీఎస్, తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలకు పట్టు ఉంది. అయితే సౌతిండియాపై కన్నేసిన నేపథ్యంలో సంయుక్తంగా చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఇందుకు, విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును, కేరళ సీఎం పినరాయి విజయన్‌ను మెచ్చుకోవడమే నిదర్శనం అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఉంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీని ధీటుగా ఎదుర్కొంటున్న ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను తన పార్టీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
కమల్ హాసన్ చాలాకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. రాజకీయాల్లోకి వస్తానని తేలిపోయాక దాడి పెంచారు. ఓ వైపు తమిళనాడులో అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అలాంటి కమల్ హాసన్ బీజేపీ మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబును ప్రశంసించారు.
బుధవారం పార్టీ ప్రకటన సమయంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మంగళవారం తనతో ఫోన్లో మాట్లాడారని, ఈ సందర్భంగా ప్రజలకు ఏం చేయాలనే విషయాలపై సలహాలు ఇచ్చారని, ఇతర అంశాల గురించి ఆందోళన చెందవద్దని చెప్పారని వ్యాఖ్యానించారు. తన హీరో చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాటికి చంద్రబాబు కేంద్రంపై మరో అడుగు ముందుకేశారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందేనని, అరకొర సాయం చేశారని, ఏపీకి న్యాయం చేయాలని గట్టిగా అడుగుతున్నానని అల్టిమేటం జారీ చేశారు.
చంద్రబాబు బీజేపీకి గుడ్ బై చెబితే ఏపీలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్-లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరో ముఖ్య విషయం ఏమంటే బీజేపీని నిత్యం విమర్శిస్తున్న కమల్ హాసన్‌కు చంద్రబాబు ఫోన్ చేయడం

Recommended