Cyclone Pethai: Andhra Pradesh On High Alert | పెథాయ్‌ ఎఫెక్ట్ తో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం!!

  • 5 years ago
Andhra Pradesh Having heavy rainfall and strong winds on Monday as Cyclone Phethai is set to make landfall in the afternoon today. Rough sea and strong winds in Kakinada of East Godavari district in Andhra Pradesh, #CyclonePhethai is expected to make a landfall this afternoon.
#CyclonePethai
#Pethai
#పెథాయ్‌
#AndhraPradesh
#coastalAndhra
#WeatherUpdates

కోస్తాంధ్ర మొత్తం 'పెథాయ్‌'తో వణుకుతోంది. రాత్రి నుండి కోస్తా జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అన్ని జిల్లాల్లో నూ అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసారు. పున‌రావాస శిబిరాలు సిద్దం అయ్యాయి. సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ, యానాం-తుని మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెథాయ్ తుఫాను తీరం దిశగా దూసుకొస్తోంది. ఎక్కడ తీరం దాటుతుందనే అంశంపై వాతావ‌ర‌ణ శాఖ‌..ఆర్టీజిఎస్ లు అధికారుల‌ను అల‌ర్ట్ చేసాయి. ఏడు జిల్లాల పై ప్ర‌ధాన ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ జిల్లాల అధికా రుల‌ను ఇప్ప‌టికే క్షేత్ర స్థాయిలో అన్ని ర‌కాలుగా సిద్దంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. తీరం తాకే సమయా నికి గాలుల తీవ్రత తగ్గుతుందని తొలుత భావించినప్పటికీ... ఆ అంచనా మారిపోయింది. అంతకుముందు గంటకు 14-15కి.మీ. వేగంతో కదిలిన తుఫాను తర్వాత 26కి.మీ. వేగం పుంజుకుంది. దీంతో తీరం వెంబడి గంటకు 50-60కి.మీవేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ తీరందాటే సమయానికి గంటకు 100కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని, ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే కలిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు కార్య‌క్ర‌మం మొద‌లైంది

Recommended