Asia Cup 2018 : Dhoni 1st Asian Wicket keeper To Affect 800 Dismissals In International Cricket

  • 6 years ago
Mahendra Singh Dhoni reached another milestone in his glittering cricket career on Friday during India's Asia Cup 2018 final versus Bangladesh at the Dubai International Stadium.
#indiavsbangladesh
#indiavspak
#msdhoni
#asiacup2018
#dhoni
#dhavan
#rohitsharma

ఆసియాకప్ టోర్నీలో భాగంగా దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని అందుకున్నాడు. ఆసియాకప్‌ ఫైనల్లో కుల్దీప్‌ బౌలింగ్‌లో మొర్తజాను స్టంపౌట్‌ చేయడం ద్వారా 800 ఔట్లలో పాలుపంచుకున్న తొలి ఆసియా వికెట్‌ కీపర్‌గా ధోని ఘనత సాధించాడు.
మొత్తంగా టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్‌ కీపర్‌గా మార్క్‌ బౌచర్‌ (998), గిల్‌క్రిస్ట్‌ (905) తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్‌కీపర్‌ (184)గా తన స్టంపౌట్ల సంఖ్యను మరింతగా పెంచుకున్నాడు. సంగక్కర (139) రెండో స్థానంలో, కలువితరణ (101) మూడో స్థానాల్లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్‌ టైటిల్‌. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్‌ దాస్‌ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీ సాధించగా సౌమ్య సర్కార్‌ (33), మెహదీ హసన్‌ (32) ఫర్వాలేదనిపించారు.

Recommended