Dil Raju Speech @Srinivasa Kalyanam Pre Release Event

  • 6 years ago
Producer Dil Raju Fires On Websites about Srinivasa Kalyanam rumors. Srinivasa Kalyanam' starring Nithiin and Raashi Khanna, which is going to release on August 9.


నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన గురించి తప్పుడు రాతలు రాసిన వారిపై ఫైర్ అయ్యారు.
రిలీజ్‌కు ఐదు రోజుల ముందు డిస్ట్రిబ్యూటర్లకు సినిమా చూపించాలంటే నిర్మాతకు భయం.... సినిమా నచ్చకపోతే డబ్బులు కట్టరేమో అని. కానీ నా డిస్ట్రిబ్యూటర్లకు పిలిచి చూపిస్తాను. అది మంచైనా, చెడైనా... సంతోషంగా స్వీకరిస్తాను అని దిల్ రాజు తెలిపారు.
ఈస్ట్ డిస్టిబ్యూటర్ ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారంటే సినిమా బావుంటే ఎలా పొగుడుతారో, బాగోలేకుంటే అలాగే తిడతారు. ఆయనలాగే నా టెక్నీషియన్స్‌, అందరూ ఏండాలని కోరుకుంటాను. అప్పుడే సినిమా గురించి నిజం మాకు తెలుస్తుందని దిల్ రాజు అన్నారు.
ఓ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ.... మాకు సినిమా చూపించే దమ్ము ఈ రోజుల్లో ఎవరికీ ఉండదు. ఎందుకంటే అది కోట్ల మీద వ్యాపారం. అలాంటిది మమ్మల్ని పిలిచి చూపిస్తున్నారంటే.... ముందే ఫిక్స్ అయ్యాం. ఆయన సినిమా చూపిస్తామని చెప్పగానే సినిమా హిట్టని ఫిక్స్ అయ్యాం. చూసిన తర్వాత మాటల్లేవు అని వ్యాఖ్యానించారు. మరో డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ.. దిల్ రాజు, వెంకటేశ్వర క్రియేషన్స్ స్థాయిని పది రెట్లు పెంచే సినిమా ఇది. ఇలాంటి సినిమాను విడుదల చేస్తున్నందుకు గర్వ పడుతున్నామన్నారు.
దర్శకుడు సతీష్ వేగశ్న కథ చెప్పగానే జయసుధ, నితిన్, ప్రకాష్ రాజ్ కథ చాలా బావుందని చెప్పారు. కథ చెప్పడం వేరు, దాన్ని సినిమాగా మలచడం వేరు. కథ అనుకున్నదగ్గరి నుండి సతీష్, నేను, మా టీం అంతా ట్రావెలైన విధానం మాకు మాత్రమే తెలుసు. ఏదో వెబ్ సైట్లో దిల్ రాజు దీనికి డెబ్యూ డైరెక్టర్‌గా చేశాడు... అని రాశారు. అది చూసి చాలా హర్ట్ అయ్యాను. దయచేసి నేను కోరుకునేది ఒకటే. అది దర్శకుల సినిమా. నేను వెనకాల ఉంటాను... అందరూ ఇది గుర్తుంచుకోవాలి అని దిల్ రాజు అన్నారు.

Recommended