కమల్ హాసన్ పై కేసు నమోదు చేసిన అమ్మ అభిమానులు
  • 6 years ago
A complaint has been lodged against Tamil star and politician Kamal Haasan and his show Big Boss 2 (Tamil) for portraying former Cheif Minister of Tamil Nadu J. Jayalalithaa as a dictator.The complainant alleged that Kamal Haasan tried to defame the former CM during his reality show.
#tamilcinema
#jayalalitha
#kamalhaasan
#bigboss
#realityshow


రియాల్టీ షోలతో కొందరు సెలబ్రిటీలు తమదైన శైలిలో దూసుకుపోతుండగా... మరికొందరు ఇబ్బందుల్లో పడుతున్నారు. రేటింగ్స్ కోసం అనవసరమైన అంశాలను లేవనెత్తి లేనిపోని కష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. తాజాగా ప్రముఖ ప్రముఖ నటుడు యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ ఇరకాటంలో పడ్డాడు. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ్ రియాల్టీ షో బిగ్ బాస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జయలలిత ఒక నియంతగా పేర్కొంటూ తమిళ రియాల్టీ షోలో కమల్ వ్యాఖ్యానించి తన అభిమాన నేతను అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక టాస్క్‌ చేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నియంతలకు ఎలాంటి గతి పట్టిందో తెలుసు కదా అంటూ కమల్ కమెంట్ చేశారు. జయలలితను ఉద్దేశించే కమల్ ఈ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో అమ్మ అభిమానులు పేర్కొన్నారు.
Recommended