కాపు రిజర్వేషన్లపై కలకలం రేపుతున్న జగన్ వ్యాఖ్యలు

  • 6 years ago
Reacting bitterly to YSR Congress president YS Jagan Mohan Reddy’s comment that the Kapu reservations were not possible, TDP leaders said Jagan had utterly failed in mounting pressure on the Centre on the issue.
#YSRCongress
#TDP
#Kapureservation

కాపు రిజర్వేషన్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కాపు నేతలు, కాపు యువత మండిపడుతున్నారు. మరోవైపు, వైసీపీ జగన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
జగన్ చేసిన వ్యాఖ్యలు కాపులను అసంతృప్తికి గురి చేశాయి. కాపు నాయకులు కొందరు కిర్లంపూడి సమీపంలో ఆదివారం జగన్‌ను అడ్డుకున్నారు కూడా. దానికి తోడు ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నట్లుగా వైసీపీ గుర్తించింది. దీంతో ఆ పార్టీ జగన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు తంటాలు పడుతోంది. జగన్ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని సోమవారం అంబటి రాంబాబు చెప్పారు.

Recommended