Jyothika's Jhansi Movie Teaser Launched By Sudheer babu
  • 6 years ago
తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలకు సిద్ధం అవుతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించగా స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాలా దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రాన్ని తెలుగులో కోనేరు కల్పన, డీ అభిరాం అజయ్‌కుమార్ రూపొందించారు. కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్ర టీజర్‌ను సమ్మోహనం చిత్రంతో మంచి విజయం సాధించిన యువ హీరో సుధీర్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ.. టీజర్ చాల బాగుంది. జ్యోతికను పోలీస్ ఆఫీసర్‌గా చూస్తుంటే ఆమె భర్త సూర్య గుర్తుకొస్తున్నారు. పోలీస్ సినిమా అంటే సూర్య గుర్తుకు రావడం కంపల్సరీ. ఇప్పుడు వారి సతీమణి జ్యోతిక కూడా పోలీస్ ఆఫీసర్‌గా సినిమా చేయటం చాల ఆనందంగా ఉంది. తమిళంలో ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

After long gap, Surya's wife Jyothika re entry into tollywood. She is coming with Jhansi, which remake of Nachiyar Tamil movie. This teaser was launched by Tollywood hero Sudheer Babu.
#Jhansi
#SudheerBabu
Recommended