దేశ రాజ‌కీయాల్లో మ‌రో సారి చ‌క్రం తిప్పేందుకు చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌లు

  • 6 years ago
tdp mps planning to move no confidence motion in the parliament against bjp government. ap cm chandrababu naidu bringing all parties under one roof against nda. due to not implementing the bifurcation promises chandrababu came out from bjp government.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు వాడి-వేడిగా జ‌ర‌గ‌బోతున్నాయా..? రెండు తెలుగు రాష్ట్రాలు పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను కుదిపేయ‌నున్నాయా.? విభ‌జ‌న హామీల అమ‌లు ప‌ట్ల విప‌క్షాలను ఏకం చేసేందుకు ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పావులు క‌దుపుతున్నారా..? మోదీ స‌ర్కార్ ను ఇరుకున పెట్టేందుకు చంద్ర‌బాబు అస్త్ర శ‌స్త్రాలు సిద్దం చేస్తున్నారా..? కేంద్రం పై అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌త్తు తెలిపేందుకు దేశం లోని బీజేపి యేత‌ర ఎంపీల ఏకాభిప్రాయానికి బాబు క్రుషి చేస్తున్నారా..? అందులో భాగంగానే ఉండ‌వ‌ల్లి, కేశ‌వ‌రావు లాంటి సీనియ‌ర్ నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. విభ‌జ‌న హామీల అమ‌లు ప‌ట్ల స్త‌బ్దుగా ఉన్న బీజేపి ప్ర‌భుత్వాన్ని పార్ల‌మెంట్ సాక్షిగా నిల‌దీసేందుకు బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు స‌మాచారం.. ఇంత‌కి చంద్ర‌బాబు కేంద్ర‌ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వేయ‌బోయే అడుగులు ఏంటి..? తెలుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!
పార్ల‌మెంట్ స‌మావేశాల సాక్షిగా ఏపి సీయం చంద్ర‌బాబు నాయుడు మ‌రో సారి దేశ రాజ‌కాయాల్లో చ‌క్రం తిప్ప‌బోతున్నారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ కి మోదీ ఇచ్చిన హామీల‌ను ఎందుకు విస్మ‌రించార‌ని పార్ల‌మెంట్ స‌మావేశాల వేదిక‌గా మ‌రో సారి ప్ర‌శ్నించ‌బోతున్నారు. లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి చేయూత అందించే విధానం ఇదేనా అని నిల‌దీయ బోతున్నారు చంద్ర‌బాబు. మిత్ర ధ‌ర్మాన్ని విభేదించి కేంద్ర ప్ర‌భుత్వం పై ప్ర‌ఛ్చ‌న్న యుద్దం చేసేందుకు బాబు పావులు క‌దుపుతున్నారు. క‌లిసి వ‌చ్చే పార్టీల మ‌ద్ద‌త్తు కూడగ‌ట్టుకుని ఏపికి జ‌రిగిన అన్యాయాన్ని వివ‌రించాల‌ని ప‌థ‌కం వేసారు. అందుకోసం శ‌త్రుత్వం ఉన్న పార్టీల‌ను కూడా మిత్రులుగా మార్చుకునేందుకు చంద్ర‌బాబు సాహ‌సం చేస్తున్నారు.

Recommended