ఆస్పత్రి బెడ్‌పైనే మోడీని ఆటోగ్రాఫ్ అడిగిన యువతి

  • 6 years ago
పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో ఏర్పాటు చేసిన కృషి వికాస్ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తుండగా ఓ టెంట్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 22 మందికి గాయాలయ్యాయి. పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి.
క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని మోడీ.. వారిని పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Recommended