India Vs England: Injured Wriddhiman Saha In Doubt For England Tests
  • 6 years ago
India’s first choice wicket-keeper Wriddhiman Saha is unlikely to make the cut for the Test series in England. Saha had injured his thumb during the IPL and while it was initially believed that he would be fit in four to five weeks, the recovery hasn’t gone as per plan and he was seen sporting a soft plaster even last week. Dinesh Karthik, who stepped in for Saha for the one-off Test against Afghanistan, is likely to continue in the role.
#india
#england
#wriddhimansaha
#dineshkarthik
#cricket

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఆడే దానిపై ఇంకా అనుమానాలు నెలకొన్నాయి. ఆగస్టు 1నుంచి జరగనున్న సిరీస్‌ కోసం సాహా స్థానంలో దినేశ్ కార్తీక్‌ని భారత సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ ముగియగా.. మంగళవారం జరగనున్న మూడో వన్డేతో వన్డే సిరీస్‌ కూడా ముగియనుంది. ఆ తర్వాత ఆగస్టు తొలి వారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులను భారత్ జట్టు ఆడనుంది.ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన వృద్ధిమాన్ సాహా కీపింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. అతని చేతి వేలికి తీవ్ర గాయమవడంతో.. కనీసం ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని అప్పట్లో వైద్యులు సూచించారు. దీంతో.. గత నెలలో బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కి సాహా దూరమవగా.. అతని స్థానంలో దినేశ్ కార్తీక్‌ ఎంపికయ్యాడు.
Recommended