• 7 years ago
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ వివాహం హీరోయిన్ మదాలసా శర్మతో సింపుల్‌గా జరిగింది. ఈ వేడుకలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జులై 7న వీరి వివాహం ఊటీలో గ్రాండ్‌గా జరుగాల్సి ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం మహాక్షయ్ మీద రేప్ కేసు నమోదు కావడంతో నిందితుడుగా ఉన్న అతడిని విచారించేందుకు పోలీసులు పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడంతో వివాహం వాయిదా పడింది. ఆ తర్వాత వెంటనే కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు శుభాష్ శర్మ, నటి శీలా శర్మ కుమార్తె అయిన మదాలసా శర్మ కొంత కాలంగా మహాక్షయ్ చక్రవర్తితో రిలేషన్లో ఉంది. ఇరు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేసు నమోదైన తర్వాత కూడా మదాలసా కుటుంబం పెళ్లికి ఆపక పోవడానికి కారణం తను మెచ్చిన వాడినే పెళ్లాడేందుకు మదాలసా శర్మ సంతోషంగా ఒప్పుకోవడమే అని తెలుస్తోంది.
మహాక్షయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఇటీవల ఓ యువతి కంప్లయింట్ చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, తనకు ఇష్టం లేకున్నా ఏవో మందుల ఇచ్చి అబార్షన్ అయ్యేలా చేశాడని ఆరోపించింది. మహాక్షయ్ తల్లి, మిథున్ భార్య యోగితా బాలి కూడా ఇందుకు సహకరించిందని, నువ్వు ఎప్పటికీ నా కోడలివి కాలేవని తనను బెదిరించిందని... యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

Recommended