IND Vs ENG 3rd T20 Preview
  • 6 years ago
India's wrist spinners Kuldeep Yadav wreaked havoc in the opening Twenty20 International of the series at Old Trafford in Manchester on Tuesday as he claimed a five-for by giving away just 24 runs that led to the visitors' eight wicket win. However, Yadav and Yuzvendra Chahal were rendered ineffective in the second T20I at Cardiff. With the three-match series evenly poised, India would too to bounce back against a 'well-prepared' home side when the two teams face each other in the decider in Bristol on Sunday. The Indian spin duo faces its first real challenge in more than a year with England batsmen biting back immediately after drubbing in Manchester.
#india
#england
#t20
#alexhales
#benstokes

భారత్, ఇంగ్లాండ్ మధ్య ముగియనున్నటీ20 సిరీస్‌‌లో ఆఖరి మ్యాచ్‌కు సర్వం సిద్దమైంది. మూడు టీ20ల ఈ సిరీస్‌లో రెండు జట్లూ చెరొక మ్యాచ్‌లో గెలుపొందడంతో.. నిర్ణయాత్మక మ్యాచ్‌ కోసం ఆదివారం రోజు సాయంత్రం 06.30కు ఇరు జట్లు తలపడనున్నాయి. బ్రిస్టోల్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. వరుసగా ఆరు టీ20 సిరీస్‌లు గెలిచిన జట్టుగా నిలవనుంది. మరోవైపు.. తొలి టీ20లో ఓడిన ఇంగ్లాండ్.. రెండో టీ20లో అద్భుతంగా పుంజుకుంది.తొలి టీ20లో 5 వికెట్లు తీసి భారత జట్టుని గెలిపించిన కుల్దీప్ యాదవ్.. రెండో టీ20లో ఘోరంగా విఫలమయ్యాడు. అతను 4 ఓవర్లు బౌలింగ్ చేసినా కనీసం ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ తొలి టీ20లో సెంచరీ బాదిన కేఎల్ రాహుల్.. రెండో టీ20లో 6 పరుగులకే ఔటవగా.. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ సైతం విఫలమయ్యారు. అయితే.. విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ.. మళ్లీ బ్యాటింగ్‌ టచ్‌లోకి రావడం భారత జట్టుకి కాస్త ఉపశమనం.
Recommended