India Vs Ireland Victory Will Give Confidence: Rohit Sharma

  • 6 years ago
Opener Rohit Sharma believes that if India manage to beat Ireland 2-0 in the ongoing T20I series, it will be a massive confidence booster for the team ahead of the crucial England tour, which starts on July 3.Speaking to Shikhar Dhawan — during a chat which was posted by BCCI.tv — Sharma reiterated the fact that playing the 'Three Lions' in their backyard will be 'challenging prospect', so they will look to sign off in Ireland with a victory and take that momentum over to the England series.
ఐర్లాండ్‌ పర్యటనను విజయంతో ఆరంభించడం ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా రెండు టీ20ల సిరిస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన 76 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తొలి టీ20లో రోహిత్‌ శర్మ 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం (జూన్ 29)న డబ్లిన్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ "ఐర్లాండ్‌ పర్యటనను విజయంతో ఆరంభించడం ఎంతో సంతోషంగా ఉంది" అని అన్నాడు.
త్వరలో టీమిండియా ఐర్లాండ్‌ పర్యటన ముగించుకుని ఇంగ్లాండ్‌ వెళ్లనుంది. ఇంగ్లాండ్‌ పర్యటన సవాలుతో కూడుకున్నది. ఇంగ్లాండ్‌ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో ఆడటంతో మంచి సన్నాహకంగా ఉంది. రెండో టీ20లో కూడా మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. గెలుపు ఎప్పుడైనా మనలో ఆత్మవిశ్వాసం నింపుతుంది" అని రోహిత్ శర్మ అన్నాడు
#india
#ireland
#t20
#englandtour
#rohitsharma
#viratkohli

Recommended