అలా చేస్తే పవన్ కింగ్ మేకర్ అవుతాడా ??

  • 6 years ago
CPI Ramakrishna on Monday warned Jana Sena chief Pawan Kalyan that if he will go with YSR Congress Party in next elections, his party will disappear.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు అన్ని పార్టీలు తాము ఒంటరిగా ముందుకు సాగుతామని చెబుతున్నాయి. మరోవైపు, పొత్తుల కోసం ఎదురు చూస్తున్న వైఖరి కూడా కొన్ని పార్టీల్లో కనిపిస్తోంది. అందుకు నేతల వ్యాఖ్యలే నిదర్శనం. వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి.
జనసేన అధినేత జగన్‌కు మద్దతిచ్చేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు అవినీతి జనసేనానికి నచ్చలేదని ఆయన అన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్, జగన్‌లు వచ్చే ఎన్నికల్లో కలుస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. దీనిపై పరోక్షంగా పవన్ కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆ చర్చ మాత్రం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో సీపీఐ నేత రామకృష్ణ సోమవారం ఆసక్తికర, కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, జగన్ కలిస్తే ఏమవుతుందో కూడా చెప్పారు. అదే జరిగితే కనుక పవన్ కళ్యాణ్ పార్టీ పని అయిపోయినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా ఇరు పార్టీల పొత్తు సరికాదని అభిప్రాయపడ్డారు.
జగన్ ధ్యాస అంతా ముఖ్యమంత్రి పదవి సీటుపైనే ఉందని రామకృష్ణ మండిపడ్డారు. ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని వెల్లడించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దోచేశారని నిప్పులు చెరిగారు. జగన్‌ను అంత సులభంగా ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పవన్ జతకడితే జనసేన కథ ముగిసినట్లేనని ఆయన హెచ్చరించారు.

Recommended