యూకే-ఇండియా అవార్డులు: శిల్పాశెట్టికి గ్లోబల్ ఇండియన్ ఐకాన్ అవార్డు

  • 6 years ago
The 2nd Annual UK-India Awards ceremony was held to celebrate the winning partnership between the UK and India.

యూకే భారత్‌ల మధ్య బంధం బలోపేతం అయిన దృష్ట్యా యూకే-ఇండియా వీక్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా అవార్డుల కార్యక్రమం లండన్‌లో ఘనంగా జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేసిన వ్యక్తులకు సంస్థలకు ఈ కార్యక్రమంలో అవార్డులను అందజేశారు. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 400మంది సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇందులో వాణిజ్య రంగం, రాజకీయ, దౌత్య, మీడియా, కళలు మరియు సంస్కృతి రంగాల నుంచి అతిథులుగా ప్రముఖలు హాజరయ్యారు. వాణిజ్య రంగంలో విశేష అనుభవం ఉన్న సునీల్ భారతి మిట్టల్, బ్రిటన్ ఎంపీ ప్రీతి పటేల్, ఎంపీ బారీ గార్డెనర్, ఎంపీ లార్డ్ మార్లండ్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి యూకే ఇండియా అవార్డుల విజేతలను ప్రకటించారు.
ఈ ఏడాది యూకే ఇండియా కార్యక్రమానికి బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రెండు దేశాల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలను పురస్కరించుకుని ఇందుకోసం కృషి చేసిన వ్యక్తలకు, సంస్థలకు యూకే ఇండియా అవార్డులు ఇవ్వడం జరుగుతోందని యూకే ఇండియా వీక్ వ్యవస్థాపకులు, బ్రిటీష్ ఇండియా పారిశ్రామికవేత్త, రాజకీయ విశ్లేషకులు మనోజ్ లాద్వా తెలిపారు.

Recommended