IPC Section Bharya Bandhu Audio Success Meet

  • 6 years ago
Srinivas’s upcoming film ‘IPC Section Bharya Bandhu’ has finally released its official trailer.

ఐపీసీ సెక్షన్..భార్యాబంధు. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. విజయ్ కురాకుల సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కాన్సెప్ట్ ప్రధానంగా సాగే చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఓ సున్నితమైన అంశానికి చక్కని హాస్యాన్ని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య కొన్ని చట్టాలు ఎలాంటి అగాధాన్ని సృష్టిస్తున్నాయి? వారి బంధాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నాయి?. భార్యాభర్తల బంధానికి బంధువుగా నిలిచే ఓ అంశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మించాం అన్నారు.

Recommended