ఎన్నికల్లో వైసిపి పార్టీ వ్యూహం
  • 6 years ago
West Godavari:An analysis of political observers on the Jagan West Godavari district padayatra Completion.

రాజకీయాలంటేనే ఎత్తులు...పైఎత్తులు... వ్యూహాలు...ప్రతివ్యూహాలు...అంచనాలు... ఆశాభంగాలు...ఇలా ఎన్నో రకాల మిగతా రంగాలతో పోలిస్తే ఈ రంగంలో ఇవి చాలా ఎక్కువ. అలా జరగడం ఖాయం అని...ఎంతో నమ్మకం పెట్టుకున్న సందర్భాల్లోనూ అనూహ్యమైన భంగపాటులు తప్పవు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే...ప్రస్తుతం ఎపిలో ప్రతిపక్షపార్టీ వైసిపి కూడా ఆశాభంగం చెందిన స్థితిలో ఉందా అంటే...ఆ పార్టీ నేతలు అంగీకరించినా? అంగీకరించకపోయినా...అదే నిజమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదెలాగంటే...
వైసిపి అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరుకునే సరికి రాష్ట్రంలో చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల కారణంగా టిడిపి ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. అదే సమయంలో టిడిపి నుంచి కొందరు నేతలు వైకాపాకు వరుసకట్టడంతో ఇక అదే జోరు కొనసాగుతుందని, ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్న పశ్చిమ గోదావరిలోనూ ఇదే ట్రెండ్ కొనసాగి పార్టీ బలం పుంజుకుంటుందని ఆశించారు. అయితే మంగళవారంతో జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ముగిసిపోయి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.
Recommended