Veere Di Wedding Movie Makes Sensations In India

  • 6 years ago
అడల్ట్ కామెడీతో రూపొందిన వీర్ ది వెడ్డింగ్ చిత్రంపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. నలుగురు బాల్య స్నేహితురాళ్ల జీవితం, వారి లైఫ్‌లో చోటుచేసుకొన్న సంఘటనలు ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు, డైలాగ్స్ కేవలం పెద్దలకు మాత్రమే అనే రేంజ్‌లో ఉండటం, కొన్ని సీన్లు వివాదాస్పదంగా మారడంతో ఈ సినిమాపై పెరుగుతున్నది.
వీర్ ది వెడ్డింగ్ చిత్రంలో కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరభాస్కర్, శిఖా తల్సానియా నటించారు. అయితే హాలీవుడ్‌లో రూపొందిన సెక్స్ అండ్ ది సిటీ చిత్రానికి దాదాపు దగ్గరవుండటం వల్ల ఆ చిత్రానికి కాపీ అనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.
సెక్స్ అండ్ ది సిటీ, వీర్ ది వెడ్డింగ్ రెండు చిత్రాల్లోనూ కథ నలుగురు అమ్మాయిలదే. మిరాండా పోషించిన పాత్రను హిందీలో అవనీ (లాయర్) రోల్‌ను సోనమ్ కపూర్ పోషించారు. పెళ్లి కంటే కెరీర్‌ ముఖ్యమని భావించే నవతరం అమ్మాయి.
నలుగురు స్నేహితురాళ్లలో మీరా (శిఖా తల్సానియా) మధ్య వయసులో ఉన్న యువతి పాత్రను పోషించారు. చిన్న వయసులో తల్లి బాధ్యతను మోస్తూ చికాకు పడే పాత్ర. సెక్స్ అండ్ సిటీలో చార్లేట్ (క్రిస్టిన్ డెవిస్) పోషించింది.

Recommended