Officer Movie Review ఆఫీసర్ సినిమా రివ్యూ
  • 6 years ago
Nagarjuna and Ram Gopal Varma joined hands for an intense cop thriller ‘Officer’. After a few postponements, the film is finally hitting the screens on June 1st, 2018. Coming from the combination of evergreen ‘Shiva’, this film is expected to have a lot of expectations over it and audience are hoping that ‘Officer’ will sign off this Summer on a high note.

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, కింగ్ నాగార్జున అక్కినేని కాంబినేషనల్‌లో వచ్చిన శివ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమను ప్రభావితం చేసింది. ఫిల్మ్ మేకింగ్‌లో ఆ చిత్రం ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అలాంటి కాంబినేషన్ మళ్లీ ఆఫీసర్ చిత్రం కోసం జతకట్టింది. సినిమా ఓపెనింగ్ రోజున 'నా బుర్రలో గుజ్జు అయిపోయిందని విమర్శించే వాళ్లకు ఆఫీసర్ చిత్రం ఓ సమాధానం' అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆఫీసర్ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆఫీసర్ సినిమా వర్మ కమ్‌బ్యాక్ మూవీ అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీసర్ సినిమా జూన్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మళ్లీ శివ రేంజ్ సక్సెస్ సాధించిందా? ఈ చిత్రంపై నెలకొన్న అంచనాలను అధిగమించిందా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ముంబైలో మాఫియాను గడగడలాడించిన పోలీసు అధికారి నారాయణ పసారి (ఫిరోజ్ అబ్బాసి). ఆయన ఎన్‌కౌంటర్ స్సెషలిస్ట్. కానీ ఓ భూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆ కేసును విచారించడానికి చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి శివాజీ రావు (నాగార్జున) అనే ఆఫీసర్‌ను అపాయింట్ చేస్తారు. కేసు దర్యాప్తులో భాగంగా పసారిని శివాజీ అరెస్ట్ చేస్తాడు.
ఆ తర్వాత కేసు నిలబడకపోవడంతో పసారిని మళ్లీ ఉద్యోగంలో చేర్చుకొంటారు. ఈ నేపథ్యంలో పసారి, శివాజీ మధ్యలో విభేదాలు ముదురుతాయి. శివాజీని ఎదుర్కోవడానికి ముంబైలో పసారి మళ్లీ ఓ మాఫియాను సృష్టిస్తారు. పసారి ఎత్తులను శివాజీ ఎలా ఎదుర్కొన్నారు? పసారి సృష్టించిన మాఫియాను శివాజీ ఎలా మట్టుపెట్టారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆఫీసర్ సినిమా చూడాల్సిందే.
Recommended