Pro Kabaddi League 2018: Most Expensive Players Of This Season
  • 6 years ago
The first day of the Pro Kabaddi League auction in Mumbai on Wednesday attracted some fierce bidding from the franchise owners, who didn’t mind breaking the bank for the athletes going under the hammer.
#prokabaddileague
#fazelatrachali
#rishankdevadiga
#rahulchaudhari
#nitintomar

ఇప్పటికే సుస్థిరమైపోయి ఉన్న ఐపీఎల్, ఐఎస్ఎల్‌ల స్థానంలో దేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళుతోంది ప్రొ కబడ్డీ. ఇదే క్రమంలో చూస్తుండగానే ప్రొ కబడ్డీ సీజన్-6 కూడా వచ్చేసింది. దీనికి సంబంధించి ముంబై వేదికగా జరిగిన తొలి రోజు వేలంలో.. ఆటగాళ్ల రేట్లు అంచనాలు తారుమారు చేశాయి. 12 ఫ్రాంచైజీల్లో 9 ఫ్రాంచైజీలు ఇప్పటికే 21 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురిని రిటెయిన్‌ చేసుకోవచ్చు.
వేలం గురువారం కూడా కొనసాగనుంది. ఈ సీజన్‌ వేలంలో మొత్తం 422 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండగా... ఇందులో 14 దేశాలకు చెందిన 58 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా ఇరాన్, బంగ్లాదేశ్, జపాన్, కెన్యా, కొరియా, మలేసియా, శ్రీలంక తదితర దేశాల ఆటగాళ్లు. ఈసారి కొత్తగా ఫ్యూచర్‌ కబడ్డీ హీరోస్‌ (ఎఫ్‌కేహెచ్‌) వేలంలోకి వచ్చారు. పీకేఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేయొచ్చు. జట్టులో కనిష్టంగా 18 మంది, గరిష్టంగా 25 మందికి మించకుండా ఆటగాళ్లను కొనాల్సి ఉంటుంది.
Recommended