IPL Players Who Excelled Beyond Expectations
  • 6 years ago
In every season of cash-rich Indian Premier League (IPL) certain players stun everyone with their superlative efforts.
#ipl2018
#shanewatson
#ambatirayudu
#kanewilliamson
#josbuttler
#umeshyadav
#chennaisuperkings

ఐపీఎల్ ఓ క్యాష్ రిచ్ టోర్నమెంట్. స్టార్‌ ఆటగాళ్ల మెరుపులు.. కళ్లు చెదిరే బౌండరీలు, సిక్సులే ఈటోర్నీ ప్రత్యేకత. ప్రాంచైజీలు సైతం పరుగుల వరద పారింటే ఆటగాళ్లవైపే మొగ్గుచూపుతాయి. వేలంలో వీరిని కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతాయి.
అయితే ఐపీఎల్ 11వ సీజన్‌లో వేలంలో కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన ఆటగాళ్లు మైదానంలోకి వచ్చేసరికి పేలవ ప్రదర్శన కనబర్చారు. మరోవైపు ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన భారత యువ క్రికెటర్లతో పాటు పలువురు విదేశీ క్రికెటర్లు సైతం అద్భుత ప్రదర్శన చేశారు.
ఆ ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం...:
గతేడాది 2017 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించిన షేన్ వాట్సన్ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది జరిగిన వేలంలో షేన్ వాట్సన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంతం చేసుకుంది. అయితే, ఈ సీజన్‌లో తన అద్భుత ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్‌ను మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేలా చేయడంలో షేన్ వాట్సన్ కీలకపాత్ర పోషించాడు. 36 ఏళ్ల షేన్ వాటన్స్ ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లాడి 555 పరుగులు నమోదు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. వాంఖడె వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో షేన్ వాట్సన్ (117 నాటౌట్) అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఐపీఎల్‌లో చాలా ఏళ్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన అంబటి రాయుడిని ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో ఆ జట్టు యాజమాన్యం వేలానికి వదిలేసింది. దీంతో 32 ఏళ్ల రాయుడిని వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన విజయాల్లో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. మొత్తం 16 మ్యాచ్‌లాడిన అంబటి రాయుడు 602 పరుగులు నమోదు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అంబటి రాయుడిని ఆ జట్టు కెప్టెన్ ధోని ఓపెనర్‌గా ఆడించాడు.
Recommended