Harbhajan Singh Explains Why He Was Dropped From Finals
  • 6 years ago
Harbhajan Singh was replaced by Karn Sharma in the final of the Indian Premier League (IPL). The decision to leave out the offie against Sunrisers Hyderabad in IPL final had baffled many. He also had not get a chance to bowl in the first Qualifier last week. The off-spinner has, however, an explanation for the move.
#ipl2018
#ipl2018final
#harbhajansingh
#chennaisuperkings
#sunrisershyderabad

ఐపీఎల్ టోర్నీలో భాగంగా గత ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు కూర్పును చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్‌ను కాదని, ఏ మాత్రం అనుభవం లేని కర్ణ్ శర్మకు తుది జట్టులో ధోని కల్పించడం వల్ల. అయితే, తుది జట్టులో ధోని భజ్జీకి చోటు కల్పించక పోడవం వెనుక ఏదో బలమైన కారణం ఉందని, అభిమానులకు ఇప్పటికీ అదొక సందేహంగానే ఉంది. తాజాగా, భజ్జీ దీనిపై వివరణ ఇచ్చాడు.
'ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ వ్యూహం ప్రకారం బ్యాట్స్‌మెన్‌కు దూరంగా బంతులేసే బౌలర్‌ కావాలి. ఫింగర్‌ స్పిన్నర్లతో చూసుకుంటే మణికట్టు స్పిన్నర్లు ఐపీఎల్‌లో చాలా ఎక్కువ ఓవర్లు వేస్తున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఈ పరిస్థితి మారుతుందని భావిస్తున్నా' అని తెలిపాడు
'ధోనీ ఏం చేసినా జట్టు విజయం కోసమే చేస్తాడు. అతనిపై ఆ నమ్మకం ఉంది. అందుకే ఫైనల్‌ ఆడే తుది జట్టులో చోటు దక్కకపోయినా నేను ఏమాత్రం బాధపడలేదు. తుది జట్టులో చోటు దక్కించుకుని కేన్‌ విలియమ్సన్‌ వికెట్‌ తీసిన కర్ణ్‌ శర్మకు అభినందనలు' అని హర్భజన్ అన్నాడు
Recommended