ఏపీ సీఎం చంద్రబాబుపై మోత్కుపల్లి ధ్వజం

  • 6 years ago
Mothkupalli Narsimhulu suspended from Telugudesam Party on Monday. Telangana TDP chief L Ramana announced in Mahanadu about his suspension.
#mothkupallinarsimhulu
#ramana
#chandrababunaidu
#mahanadu

తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎల్ రమణ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన విజయవాడలో జరుగుతున్న మహానాడు వేదికగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మోత్కుపల్లి విమర్శలు తారాస్థాయికి చేరాయన్నారు. ఆయన ద్రోహానికి క్షమాపణ లేదన్నారు. విపరీత ధోరణితో ఆయన పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పార్టీని బలహీనపరిచే విధంగా ఆయన మాట్లాడారని ఆక్షేపించారు. గవర్నర్ పదవి రాలేదని గొడవ మొదలు పెట్టారన్నారు. ఎన్టీఆర్‌కు కేసీఆర్ ప్రతిరూపం అన్నారని చెప్పారు.
గవర్నర్ పదవి రాలేదన్న అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని రమణ చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరారని తెలిపారు. అయితే మోత్కుపల్లి మాత్రం తనకు గవర్నర్ పదవి ఇస్తే తమిళనాడు కావాలని కోరారని ఆసక్తికర విషయం వెల్లడించారు. అంతకుముందు మోత్కుపల్లి అధినేతపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
చంద్రబాబు దొరకని దొంగ అని, ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సరెండర్ అయ్యారని, ఈ కేసును త్వరగా విచారించాలని మోత్కుపల్లి ఇటీవల విమర్శలు చేస్తున్నారు. అవసరమైతే తాను ఏపీలో రథయాత్ర చేపడతానని, చంద్రబాబు చరిత్రలో నల్లటి పేజీ ఉందన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలుమార్లు యూటర్న్ తీసుకున్నారని, మళ్లీ ఇప్పుడు హోదా అడగడానికి సిగ్గులేదా అన్నారు. చంద్రబాబును ప్రజలు పాతాళంలోకి తొక్కేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు

Recommended