Twitter Fake Accounts Are Created To Support Stars
  • 6 years ago
Pawan Kalyan and Allu Arjun have most fake followers on Twitter. it’s going to be a bigger shocker to know that Mahesh Babu has only 51% real followers (49% fake) and Tarak has 65% (35% fake followers). Rajamouli has the highest percentage of real followers, 72%.
ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తోంది. సోషల్ మీడియా రోజురోజుకు విస్తరిస్తోంది. వీటి ద్వారా సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు నేరుగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే అంతగొప్పగా భావిస్తుంటారు సెలబ్రిటీలు. ఇక అభిమానులైతే మా హీరోకు ఇన్ని లక్షల మంది అభిమానులు అంటూ గొప్పగా చెప్పుకుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లాంటి వాటిలో ఫోలో అయ్యేవారి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే తమ హోదా అంత ఎక్కువ పెరిగిందని భావించేవారూ ఉన్నారు. అయితే ట్విట్టర్ మీద తాజాగా విడుదలైన ఓ సర్వే నివేదిక అందరికీ షాక్ ఇచ్చింది. ట్విట్టర్లో సగం వరకు ఫేక్ అంకౌట్లే అని తేలి పోయింది.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ రాజకీయ నాయకులు, సినీ తారలను ఇన్ని మిలియన్ల మంది ఫాలో అవుతున్నట్లు నెంబరింగ్ చూసి మనం ఆశ్చర్య పోతుంటాం. అయితే ఇందులో సగంకంటే ఎక్కువ ఫేక్ అకౌంట్సేనని తెలిసింది. ట్విట్టర్లో ఒకరు ఎన్నిఖాతాలైనా తెరుచుకునే వీలుంది. దీంతో చాలా మంది నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి తమ అభిమాన తారలకు, రాజకీయ నాయకులకు ఫాలోయింగ్ నెంబర్ పెంచుతున్నారు. కొన్ని ఐటీ కంపెనీలు దీన్ని వ్యాపారంగా మార్చుకుని నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్... ఇటు సినీ, రాజకీయ సెలబ్రిటీల కేటగిరీలోకి వస్తారు. పవన్ కళ్యాన్ ఖాతాకు అత్యధిక ఫేక్ ఫాలోవర్స్ ఉన్నట్లు తేలింది. ఆయనకు ఉన్న ఫాలోవర్స్‌లో 54 శాతం ఫేక్ అని తేలిపోయింది.
దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ట్విట్టర్లో ఫాలోవర్స్ ఎక్కువే. అయితే ఆయన్ను ఫాలో అయ్యే వారిలో 55 శాతం మంది మాత్రమే నిజమైన ఫాలోవర్స్ అని తెలిసింది. దేశ వ్యాప్తంగా సెలబ్రిటీల ఖాతాలు తీసుకుంటే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తెలగాణ మంత్రి కేటీఆర్‌కు అత్యధికంగా 69 శాతం నిజమైన ఫాలోవర్స్ ఉన్నట్లు తేలింది.
#PawanKalyan
# AlluArjun
Recommended