Bahubali Actress about to Cast in YSR's Biopic As His wife

  • 6 years ago
Malayalam Superstar Mammootty is making his comeback to Telugu cinema after twenty years through Yatra, a biopic on the life of former Andhra Pradesh Chief Minister, late Dr YSR. Latest news that Bahubali actress playing kee role in this film.

వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ను దర్శకుడు మహిత్ రాఘవ తెరకేక్కిస్తున్నాడు. గతంలో ఈ డైరెక్టర్ పాటశాల, ఆనందోబ్రహ్మ సినిమాలకు దర్శకత్వం వహించడం జరిగింది. తాజాగా ఈ డైరెక్టర్ వైఎస్సార్ బయోపిక్ ను డైరెక్ట్ చెయ్యబోతుండడం విశేషం. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది.
రాజశేఖర్ రెడ్డి పాత్రలో తెలుగు హీరోలయితే నప్పరని, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని సంప్రదించారనీ, ఆయనకు వైఎస్సార్ చరిత్ర మొత్తం చెప్పి సినిమాలో నటింపజేసేందుకు అంగీకరింపజేశారు. కాగా ఈ సినిమాకు యాత్ర అనే పేరు ఖరారు చేసారు. ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ సినిమాలో నటించే పాత్రలకు నటీనటుల ఎంపిక జరుగుతోందట. ఇందులో ముఖ్యమైన విజయమ్మ పాత్రలో నయనతార నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాధికా ఆప్టే కూడా పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాని వారిద్దరు ఈ పాత్ర చెయ్యడం లేదని తెలుస్తోంది.
#Dr YSR
#nayanatara
#ashrita vemuganti
# radhika apte

Recommended