IPl 2018 : Krunal Pandya Took Two Wickets In One Ball

  • 6 years ago
Krunal Pandya took two wickets in one ball.This was happend in 2011 with praveen kumar.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై బౌలర్ కృనాల్ పాండ్యా ఒకే బంతికి రెండు వికెట్లు తీశాడు.
ఒకే బంతికి రెండు వికెట్లు అదేలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో భాగంగా మన్‌దీప్‌ సింగ్‌, కోరీ అండర్సన్‌లు ఇలా ఒకే బంతికి ఔటయ్యారు.కృనాల్ పాండ్యా వేసిన 10 ఓవర్‌ నాలుగో బంతికి మన్‌దీప్‌ సింగ్‌ ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ కోరీ అండర్సన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. అయితే వైడ్‌ అయిన ఆ నాలుగో బంతికి ముందుగా మన్‌దీప్‌ సింగ్‌ స్టంపౌట్ కాగా, ఆ వెంటనే కోరీ అండర్సన్‌ భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. దాంతో ఆ ఓవర్‌ నాలుగో బంతికే ఇద్దరు ఆటగాళ్లు పెవిలియన్‌ చేరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ప్రారంభ ఓవర్‌లోనే పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ సంచలన బౌలింగ్‌తో షాకిచ్చాడు.తొలి రెండు బంతులకు సూర్యకుమార్‌, ఇషాన్‌ బౌల్డ్‌ అవడంతో మూడో బంతికే కెప్టెన్‌ రోహిత్‌ క్రీజులోకి రావాల్సి వచ్చింది. 2011లో ప్రవీణ్‌ కుమార్‌ కూడా ఇలాగే రెండు వికెట్లు తీశాడు.
అయితే బెంగళూరుకు ఈ సంతోషం తొలి ఓవర్‌ వరకే పరిమితమైంది. ఆ తర్వాత లూయిస్‌, రోహిత్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో వారికి బెంగ తప్పలేదు. ముఖ్యంగా లూయిస్‌ బౌండరీల వర్షంతో ఆరంభం నుంచే రన్‌రేట్‌ను పదికి తగ్గకుండా చూశాడు. ఇదే జోరుతో 32 బంతుల్లో ఓ భారీ సిక్సర్‌తో అతడు ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 11వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లతో అలరించినా తర్వాత ఓవర్‌లో అండర్సన్‌కు చిక్కాడు.

Recommended