IPL 2018 Has Confirmed Its Star Casting

  • 6 years ago
IPL has declared its list on star casting for entertainment point of view.Hrithik roshan Get selected In place of ranveer singh.

క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ ఐపీఎల్. ఏప్రిల్ 7న చెన్నై, ముంబై జట్ల మధ్య జరగనున్న తొలిపోరుతో ఈ సంరంభం మొదలుకానుంది.దీనిని పురస్కరించుకొని తారాస్థాయిలో వేడుకలను నిర్వహించాలని బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. కెప్టెన్లతో పాటు, బాలీవుడ్ నుంచి టాప్ హీరో, హీరోయిన్లు కూడా వేడుకకు హాజరుకానున్నారు.
ఈ సారి ఐపీఎల్‌కు ప్రత్యేకతేంటంటే.. రెండేళ్ల నిషేదం అనంతరం చెన్నై, రాజస్థాన్ జట్లు తిరిగి ఆడుతుండటం.ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలను ఘనంగానూ అత్యంత ఆకర్షిణీయంగానూ ఉండేలా బీసీసీఐ తీర్చిదిద్దుతోంది. తొలి మ్యాచ్ జరగనున్న ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ వేడుకకు వేదికకానుంది.
బాలీవుడ్ నుంచి పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ డ్యాన్స్‌లతో అలరించనున్నారు. అంతకుముందు అనుకున్నట్లు రణవీర్ సింగ్ భుజానికి గాయం కారణంగా హాజరుకాలేకపోతున్నాడు. ఆయన స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశ్యంతో నిర్వహకులు హృతిక్ రోషన్‌ను ఆహ్వానించినట్లు సమాచారం.
ఈ వేడుక 90నిమిషాల పాటు జరగనుంది. దాదాపు సాయంత్రం 7:15నిమిషాలకు ముగిసేలా ఏర్పాటు చేశారు. అంటే సరిగ్గా మొదటి మ్యాచ్‌ టాస్ పడటానికి 15నిమిషాల ముందు ముగిసిపోతాయన్నమాట.అందరికీ అలవాటైన 'హాట్ స్టార్' ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో చూపించనుంది.
ఏటా జరిగేదానికి విరుద్ధంగా ఈ సారి ఇద్దరు కెప్టెన్లు మాత్రమే హాజరుకానున్నారు. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మలు మినహాయించి మిగిలిన వారెవ్వరూ హాజరుకాలేరు.
ఏ రోజుకారోజు లీగ్ మ్యాచ్ పూర్తి అయిన వెంటనే.. పాయింట్ల ఆధారంగా టాప్ 4 స్థానాల్లో ఉండాల్సిన జట్టును ప్రకటిస్తారు. ఈ లీగ్ 51 రోజుల పాటు జరగనుంది.

Recommended