IPL 2018 : Kane Williamson replace David Warner as Sunrisers captain
  • 6 years ago
I’ve accepted the role to stand in as captain for this season. It’s an exciting opportunity with a talented group of players. I look forward to the challenges ahead, Kane Williamson said.

మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రధాన మార్పు చోటు చేసుకుంది. జనవరి నెలాఖరులో జరిగి ఐపీఎల్ వేలం అనంతరం కెప్టెన్‌గా ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్‌ను ఖరారు చేసింది హైదరాబాద్ జట్టు. టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని ఆ కుట్రకు ప్రధాన కారకుడని తేలడంతో ఐపీఎల్‌లో సైతం అతనిని ఆడించడానికి సదరు జట్టు సుముఖత చూపించలేకపోయింది. ఈ నేపథ్యంలో జట్టుకు కొత్త కెప్టెన్ కోసం చర్చలు జరిపింది. న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్‌ను జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తూ ప్రకటించింది. ఈ విషయంపై జట్టు సీఈఓ షణ్ముగమ్ మాట్లాడుతూ.. 'కేన్ విలియమ్సన్‌ను జట్టు కెప్టెన్‌గా ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది' అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దీనికి స్పందించిన కేన్ విలియమ్సన్.. 'నేను ఈ ఛాలెంజ్ ను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి అరుదైన అవకాశాలను చేజిక్కుంచుకోవడానికి ప్రత్యర్థులను వ్యూహాలతో ఎదుర్కోవడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను' అని పేర్కొన్నాడు. టాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్న స్మిత్, వార్నర్‌లపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. వాళ్లు చేసిన దానికి ఇలాంటి కఠినమైన శిక్షను అనుభవించాల్సిందేనని అన్నాడు. ప్రతి తప్పు నుంచి పాఠం నేర్చుకుంటేనే ముందుకు వెళ్లగలమని అభిప్రాయపడ్డాడు.
Recommended