Teja Supports Sri Reddy On Behalf Of Her Interviews

  • 6 years ago
Director Teja supports Srireddy. Teja gives movie chance to Srireddy

ప్రస్తుతం విడియాలో ఎక్కడ చూసినా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి పేరే వినిపిస్తోంది.టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీ చూపు మొత్తం ఆమె వైపు మళ్లింది. తనని సినీ ప్రముఖులు కొందరు ఈ విధంగా వాడుకుని వదిలేశారో శ్రీరెడ్డి దైర్యంగా బయట పెట్టడంతో ఈ విషయం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. శ్రీరెడ్డి వైఖరికి ఇండస్ట్రీలో కొందరి నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా స్టార్ డైరెక్టర్ తేజ ఈ విషయంలో భిన్నంగా స్పందించారు. శ్రీరెడ్డికి వాదనకు మద్దత్తు ప్రకటించి సంచనలం సృష్టించారు.
అందరిని షాక్ కి గురిచేస్తూ దర్శకుడు తేజ శ్రీరెడ్డికి తన సంపూర్ణ మద్దత్తు ప్రకటించారు. శ్రీరెడ్డికి జరిగిన అన్యాయం తెలుసుకుని చాలా భాద పడ్డా అని తేజ వ్యాఖ్యానించడం విశేషం.
శ్రీరెడ్డి గురించి గత కొంతకాలంగా మీడియాలో వస్తున్న వార్తలని చూస్తున్నానని తేజ వ్యాఖ్యానించారు. జరిగిన విషయం తెలుసుకునేందుకు ఆమెని వెతికి మరి పట్టుకున్నా అని తేజ అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని శ్రీరెడ్డి నాకు వివరించింది. చాలా భాదగా అనిపించింది అని తేజ అన్నారు
మన ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి ఇలా కష్టాల్లో ఉండడం సరికాదని, అందుకే తనరెండు చిత్రాల్లో ఆమెకు మంచి పాత్రలు ఇచ్చానని తేజ అన్నారు
ఇండస్ట్రీలో ఉన్న ప్రతిఒక్కరు నీతులు చెప్పడం కాదు. ఇలా కష్టాల్లో ఉన్న ఆర్టిస్టులని ఆదుకుని చూపించండి అంటూ తేజ హితవు పలికారు.
తనకు సినిమా వేషాలు ఇస్తానని మాట ఇచ్చి చాలా మంది ఆమెని వాడుకుని వదిలేశారు. వారంతా మాట నిలబెట్టుకోవాలని తేజ అన్నారు. శ్రీరెడ్డి ఎలాంటి అమ్మాయి అని చర్చించుకోవడం కాదు.. ఆమెకు న్యాయం చేయడం ముఖ్యం అని తేజ అన్నారు.

Recommended