Ananadam Movie Review ఆనందం మూవీ రివ్యూ..!

  • 6 years ago
Aanandam is a 2016 romantic comedy film written and directed by Ganesh Raj in his directorial debut. A Guru Raj producing this movie in as Telugu dubbing for Malayalam.Aanandam follows the life of 7 second year engineering students as they embark on their very first college tour. This movie set to release on March 23. In this occassion, Telugu Filmibeat brings exclusive review for..

ఫీల్‌గుడ్ చిత్రాలకు ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నది. మలయాళంలో రూపొందిన ప్రేమమ్ లాంటి చిత్రాలకు భారీ ఎత్తున్న తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మలయాళంలో చిన్న చిత్రంగా రూపొంది 30 కోట్లకుపైగా వసూళు చేసిన చిత్రం ఆనందం. 2016లో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎ గురురాజ్‌ తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని మార్చి 23న రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఎలాంటి ఏ మేరకు ఆకట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల సమాహారమే ఆనందం సినిమా కథ. 1 ఇండస్ట్రియల్ టూర్‌ లో 4 రోజులపాటు 3 ప్రేమజంటల లైఫ్‌లో చోటుచేసుకొన్న సంఘటనలే ఈ చిత్రానికి మూలకథ. హంపీతో ప్రారంభమైన టూర్ గోవాలో న్యూ ఇయర్ రోజున ముగియడం ఈ కథలో సరికొత్త పాయింట్.
ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో మూడు ప్రేమజంటల మధ్య చోటు చేసుకొన్న ప్రేమ, స్నేహం, ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్ వారిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? వారి తమకు తాము ఎలా మారారు? ఎలాంటి త్యాగాలకు సిద్ధపడ్డారనే ప్రశ్నలకు సమాధానమే ఆనందం సినిమా కథ.
భావోద్వేగంగా సాగిన కథలో చిలిపి సంఘటనలు, అల్లరి పనులు అన్నీ అలరించేలా ఉంటాయి. టూర్‌లో చోటుచేసుకొనే సరదా సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి చిత్రం కొత్తేమీ కాదు. ప్రేమదేశం, హ్యాపీడేస్, ఈ మధ్య వచ్చిన కిరిక్ పార్టీ లాంటి యూత్, కాలేజ్ రోమాన్స్ సినిమాలు మన ప్రేక్షకులను ఎప్పుడో ఆనందానికి గురిచేశాయి. ఈ చిత్రంలో పెద్దగా ఆకట్టుకొనే పాయింట్లు లేకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం
రాక్‌స్టార్ గౌతమ్, కుప్పి, దియా, వరుణ్, అక్షయ్ లాంటి పాత్రలు మన కళ్ల ఎదుట కనిపించే పాత్రలే. కాకపోతే తెలుగు నేటివిటి కొంత కరువు కావడమనే ప్రేక్షకులకు కనెక్ట్ కాని అంశంగా మారుతుంది. ఓవరాల్‌గా సినిమాను పరిశీలిస్తే ఓ కథగా కాకుండా ఓ ట్రావెల్ జర్నీలా ఉంటుంది.

Recommended