రంగులరాట్నం మూవీ రివ్యూ..!

  • 6 years ago
Rangula Ratnam Movie starring Raj Tarun, Chitra Shukla. Written & Directed by Shreeranjani, Music Composed By Sricharan Pakala, Produced by Akkineni Nagarjuna under Annapurna Studios.This movie set to release on 14 January 2018. In this occassion Telugu Filmibeat brings exclusive review..

టాలీవుడ్‌లోని యువ హీరోల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో రాజ్ తరుణ్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా మారిన రాజ్ తరుణ్ వరుస విజయాలను అందుకొన్నాడు. తాజాగా రంగులరాట్నం చిత్రంతో సంక్రాంతి బరిలోకి దూకాడు. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంతో రాజ్ తరుణ్ మళ్లీ సక్సెస్ అందుకొన్నాడా? ప్రేక్షకులను మెప్పించాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
విష్ణు (రాజ్ తరుణ్) ఓ కంపెనీని స్వయంగా నడుపుతుంటాడు. ఆయనకు తల్లి (సితార), స్నేహితుడు (ప్రియదర్శి) తప్ప మరొక బంధువు అంటూ ఉండరు. విష్ణుకు త్వరగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాలని తల్లి ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ మధ్యలో కీర్తి (చిత్ర శుక్లా) అనే అమ్మాయిని విష్ణు తొలి చూపులోనే ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత అనుకోకుండా తల్లి కన్నుమూస్తుంది?
తల్లి మరణంతో ఒంటరి వాడైన విష్ణు.. కీర్తి ప్రేమను, తోడును కోరుకొంటాడు. కానీ ప్రేమ, పెళ్లి మధ్య ఊగిసలాడే మనస్తత్వం ఉన్న కీర్తీ కొంత సమయాన్ని అడుగుతుంది? కీర్తి పెళ్లికి కొంత సమయాన్ని అడుగడానికి కారణం ఏమిటి? కీర్తి ప్రేమను గెలుచుకొన్నాడా? చివరికి ఏ విధంగా పెళ్లి చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే రంగుల రాట్నం కథ.
రాజ్ తరుణ్, సితార మధ్య ప్రేమ ఆప్యాయతలను ఎస్టాబ్లిష్ చేయడమనే అంశంతో సినిమా మొదలవుతుంది. ఆ పాయింట్‌నే పట్టుకొని నిస్తేజంగా ఉండే సన్నివేశాలతో ఓ గంటపాటు సాగదీసింది దర్శకురాలు శ్రీరంజని. చివరకు చిత్రశుక్లాతో ప్రేమ ఎపిసోడ్స్‌ పట్టాలక్కించడానికి చాలానే సమయం తీసుకొన్నారు. చివరికి తొలి భాగంలోనైనా రొమాంటిక్ సన్నివేశాలను బలంగా రాసుకొన్నారా అంటే అదీ కనిపించదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం సితారను చంపేసి కథను కొంత క్లిష్టంగా మార్చింది.

Recommended